ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సంతమాగులూరు మండలం సజ్జాపురంలో పర్యటిస్తారని మండల టీడీపీ నేతలు తెలిపారు. సజ్జాపురం ఎస్సీ కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మరో రూ.10 లక్షలతో నిర్మించిన మరో సీసీ రోడ్డును కూడా ఆయన ప్రారంభిస్తారని వారు తెలిపారు.