ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూముల రీ సర్వే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారీయా తెలియజేశారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి సర్వే చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సర్వేలో తొలివిడతగా ప్రభుత్వ భూములు, చెరువు, అసైన్డు భూములు అధికారులు సర్వే చేస్తారని చెప్పారు.