SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏఎస్ఐ సాయంత్రం తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్నాడు. మురికి శ్రీనివాస్, దీటి స్వామిలు తన స్కూటీపై రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు.