GNTR: రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు CRDA టెండర్లను ఆహ్వానించింది. రూ.72.69 కోట్ల అంచనా వ్యయంతో బాహ్య అభివృద్ధి, ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఎంఈపీ తదితర పనులకు మంగళవారం టెండర్లు పిలిచారు. అలాగే, రూ.49.63 కోట్ల అంచనాతో 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనుల్లో భాగంగా అదనపు ప్రీ-ఇంజినీర్డ్ భవనం (పీఈబీ) నిర్మాణం కొరకు టెండర్లు పిలిచింది.