TG: హోలీ పండుగ సందర్భంగా బలవంతంగా ఇతరుల మీద రంగులు వేయొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మహిళలతో అభ్యంతకరంగా ప్రవర్తించవద్దన్నారు. షీ టీమ్స్ గస్తీలో ఉంటాయని.. ఆకాతాయిల కదలికలను పరిశీలిస్తాయని హెచ్చరించారు. మద్యం దుకాణాలు ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలన్నారు.