HYD: తల్లి తిట్టిందని కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ డబిల్పుర రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం చితరి హనుమంతు(22) మేడ్చల్లో కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. తల్లి మందలించడంతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.