ఈ ఏడాది ఆస్కార్ వేడుక రద్దు కానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌పై ఆస్కార్ అకాడమీ స్పందించింది. ‘ఆస్కార్ అవార్డుల వేడుకను రద్దు చేయాలనే ఆలోచన అకాడమీకి లేదు. వేడుకల్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పులుంటే స్వయంగా మేమే వెల్లడిస్తాం’ అని తెలిపింది. కాగా.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది.