కృష్ణా: తెలుగు సంగీతాన్ని గాయకులు సుసంపన్నం చేస్తున్నారని సీనియర్ నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి అన్నారు. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గ యువ నాయకులు గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన గాయకులు పాటలు పాడి బహుమతులు పొందారు.