BPT: గ్రామాల్లో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందే వచ్చిందని, కూటమి ప్రభుత్వ హయాంలో పల్లెలు కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పేర్కొన్నారు. పిట్టలవానిపాలెం మండలం పోతనకట్టవారిపాలెంలో ఆదివారం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. పట్టణాల నుండి గ్రామాలకు వస్తున్న వారు పల్లెల్లో నూతన రోడ్లు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.