ఖమ్మం: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివారులోని ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో సీహెచ్సీ వైద్య బృందం శుక్రవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సీహెచ్సీ వైద్యాధికారిణి సారియా అంజుమ్ 133 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 18 మంది విద్యార్థులకు రక్త పరీక్షల కోసం ఎల్లారెడ్డిపేట సీహెచ్సీ సెంటర్కు పంపించారు.