ATP: రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లి వద్దనున్న ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అదనంగా 100 ఎకరాలలో ఎంఎస్ఈ పార్క్ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఎలా ఉంది, ఎంత స్థలం అందుబాటులో ఉంది అనే వివరాలు ఆరా తీశారు.