AKP: నర్సీపట్నం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో టౌన్ సీఐ గోవిందరావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ గోవిందరావు మాట్లాడుతూ.. శీతాకాలంలో అన్నార్తులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని సూచించారు.