WGL: విధుల్లో నిర్లక్ష్యం వహించిన వరంగల్ జిల్లా ఆర్టీఓ గంధం లక్ష్మిని గురువారం కలెక్టర్ సత్య శారద ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అడిగిన పశ్నలకు ఆర్టీఓ బాధ్యతతో కూడిన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో కలెక్టర్ సత్య శారద ఆగ్రహంతో ఆమెకు మెమో జారీ చేశారు.