WNP: అమరచింత మండల పరిధిలోని మస్తీపూర్ గ్రామ శివారు మెయిన్ రోడ్డుపై రెండు బైకులు ఎదురుగా సోమవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చంద్ర గట్టు గ్రామానికి చెందిన నల్ల రెడ్డి(56) బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న నందిమల్ల గ్రామానికి చెందిన నాగరాజు(36) బైక్‌తో ఢీకొట్టింది. వారికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.