SRD: గుమ్మడిదల మండలం బొంతపల్లి కమాన్ ప్రధాన రహదారిపై అఖిలపక్షం నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మడిదల మండలాన్ని మున్సిపాలిటీగా మార్చొద్దంటూ రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం మున్సిపాలిటీ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.