ఖమ్మం: నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూపొందించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు ప్రారంభమయ్యాయి. ఖమ్మం నగరంలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలోని ఫీడర్లలో ట్రాన్స్ ఫార్మర్లలో తలెత్తుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే పనిలో విద్యుత్ యంత్రాంగం నిమగ్నమైంది. ఆదివారం నగరంలో నిర్వహించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులను ఎస్ఈ ఎ. సురేందర్ పర్యవేక్షించారు.