NZB: ఆర్మూర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. ఎగువనుంచి ఇన్ఫ్లో రాకపోవడం, దిగువకు నీటిని వదులుతుండడంతో నిల్వ తగ్గుతోంది. ప్రాజెక్టుపూర్తి నీటి సామర్థ్యం 1091 అడుగులు(80.5TMC)కాగా ప్రస్తుతం 1090 అడుగుల(76.894TMC) నీరు నిల్వ ఉంది.8098 క్యూసెక్కుల నీటిని తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం వదులుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్తరవి తెలిపారు.