ADB: సీఎం కప్ 2024 భాగంగా జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటానికి క్రీడాకారులు సోమవారం ఉదయం బయలుదేరారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు అల్పాహారం అందజేశారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని ఆయన ఆకాంక్షించారు.