NZB: బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బోరెడ్డి అరవింద్ రెడ్డి కెనడా క్రికెట్ జట్టులో ఆడుతూ రాణిస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన అరవింద్ రెడ్డి చదువుతో పాటు ఆ దేశ డొమెస్టిక్ జట్టు తరఫున ఎంపికై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని తల్లిదండ్రులు బోరెడ్డి బాలకిషన్ రెడ్డి, మంజులతో పాటు పలువురు అభినందించారు.