NZB: భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫీడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోనేరు హంపీకి ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా ఆమె ఫోటోను జోడించిన ఎంపీ అర్వింద్ ఈ అపూర్వ విజయంతో ఆమె దేశమంతటికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.