MBNR: అమనగల్లు మండలంలో వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, లేని పక్షంలో జరిమానా తప్పదని అమనగల్లు ఎస్సై వెంకటేష్ ఆదివారం హెచ్చరించారు. లైసెన్సు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్సై వెంకటేష్ అన్నారు.