EG: మండపేట మండలం ద్వారపూడి లో డ్రైవర్ కాలనీలో సీసీ రోడ్లు డ్రైన్ పనులను పంచాయతీ వద్ద కమ్యూనిటీ హాల్ పనులను ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.