GNTR: తెనాలిలో డిసెంబర్ 31న మంగళవారం రాత్రి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని 3 టౌన్ సీఐ రమేశ్ బాబు తెలియజేశారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ రోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎవ్వరు రోడ్లపై తిరగవద్దని సూచించారు. రోడ్లపై మద్యం తాగినా, బహిరంగంగా కేక్‌లు కట్ చేసినా కేసులు పెడతామని హెచ్చరించారు.