KDP: రేపటి నుంచి కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్ర మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రక్రియ మొత్తం రిహార్సల్స్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా పర్య వేక్షించారు. వచ్చే అభ్యర్థులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిష్ఠమైన ఏర్పాట్లు చేయాలన్నారు.