W.G: తణుకు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డిపో పరిసర ప్రాంత ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.