Minister Dharmana Prasada Rao కామెంట్స్ … మహిళలు.. వాళ్ల మాటలు వినకండి..!
Prasada Rao : ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తమ ఇంట్లో భర్త, తండ్రి, సోదరుల మాట వినవద్దంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం... పూర్తి అధికారం మహిళలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మీ కొడుకు, భర్త, మామ సైకిల్ కి ఓటు వేయాలని కోరుతుంటారు కానీ అలా చేయకుండా మహిళలు ఆలోచించి ఓటెయ్యండి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తమ ఇంట్లో భర్త, తండ్రి, సోదరుల మాట వినవద్దంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం… పూర్తి అధికారం మహిళలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మీ కొడుకు, భర్త, మామ సైకిల్ కి ఓటు వేయాలని కోరుతుంటారు కానీ అలా చేయకుండా మహిళలు ఆలోచించి ఓటెయ్యండి అని అన్నారు. ఓటు వేసేది సీక్రెట్ కనుక మగాళ్ళ మాట ఈ విషయంలో వినవద్దని కోరారు.
మహిళలు జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఎవరి చేతులు వారు నరుక్కున్నట్లే అని ఓటు అనే తాళం మీ చేతిలో ఉంటుందని, మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. ఆర్దిక ఇబ్బంది ఉన్నా మాట ఇచ్చాం కనుక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. సీఎం జగన్ పై సైకో , పిచ్చోడు , క్రాక్ అంటూ విమర్శిస్తున్నారు , అలా ఆరోపణలు చేసిన వారిని నమ్మొద్దని ఆయన అన్నారు.
ఇక వినూత్న పద్ధతికి కేరాఫ్ ఫ్యామిలీ డాక్టర్ అని, ఈ కాన్సెప్ట్ ద్వారా సంచార వాహనాలు ఇంటి ఇంటికీ తిరిగి వైద్య సేవలు అందించనున్నాయని ధర్మాన అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధిత వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా మాట్లాడారు.