»Rapaka Varaprasad U Turn To His Stolen Vote Comments
Rapaka U-Turn అబ్బే అలా అనలేదంటూ క్లారిటీ
Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు.
Rapaka varaprasad U-Turn to his stolen vote comments
Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు. 32 ఏళ్ల క్రితం జరిగిన సర్పంచ్ (sarpanch) ఎన్నికల గురించి తాను చెప్పానని వివరించారు. నవ్వుతూనే ఆ విషయం ప్రస్తావించానని.. సీరియస్‌గా చెప్పలేదని పేర్కొన్నారు. 2019 రాజోలు అసెంబ్లీ ఎన్నిక గురించి తాను మాట్లాడలేదని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు తనకు పడలేదన్నారు. వారి ఓట్లు వైసీపీకి పడ్డాయని (Rapaka varaprasad) వివరించారు. నిన్న మాత్రం దొంగ ఓట్లతో గెలిచానని చెప్పారు. ఎమ్మెల్యేతోపాటు చింతలమోరి (chintalamori) సర్పంచ్ ఎన్నికల్లో అలా విజయం సాధించానని తెలిపారు. ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో తన అనుచరులే 10కి పైగా వేసేవారని గుర్తుచేశారు. దాంతో తన మెజార్టీ 800 వందల వరకు మెజార్టీ వచ్చేదన్నారు. ఇప్పుడు మాత్రం అసెంబ్లీ కాదు.. సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడానని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించాని నెపం మీడియాపై పెట్టారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు. రాజోలులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో (ksn raju) టీడీపీ నేతలు బేరం ఆడారని వివరించారు. అసెంబ్లీ వద్ద కూడా ఒక రాజు తనతో బేరాలకు దిగారని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని తెలిపారు. కానీ అందుకు అంగీకరించలేదని చెప్పారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమని చెప్పారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ.10 కోట్లు (10 crores) వచ్చేవని తెలిపారు. తాను సీఎం జగన్‌ను (jagan) విశ్వసించానని స్పష్టంచేశారు. టీడీపీ ఆఫర్ తిరస్కరించానని ఆయన వెల్లడించారు.