»Engineer Student Died While Dancing In Tamil Nadu
Marriage Reception డ్యాన్స్ చేస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ముందే ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineer Students) అంటే ఆ సందడే వేరు. ఆటపాటలతో హోరెత్తిస్తారు. ఆ విధంగానే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహుతురాలి (Friend) సోదరి వివాహంలో సందడి చేశాడు. దగ్గరుండి పనులు చేస్తూనే ఆ కుటుంబంలో ఒకడిగా నిలిచాడు.
స్నేహితురాలి సోదరి వివాహమంటే స్నేహితులంతా వచ్చారు. ముందే ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineer Students) అంటే ఆ సందడే వేరు. ఆటపాటలతో హోరెత్తిస్తారు. ఆ విధంగానే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహుతురాలి (Friend) సోదరి వివాహంలో సందడి చేశాడు. దగ్గరుండి పనులు చేస్తూనే ఆ కుటుంబంలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో రిసెప్షన్ (Marriage Reception)లో ఆనందోత్సాహాలతో జరుగుతోంది. హుషారైన పాటలకు అందరూ డ్యాన్స్ (Dance)లు చేస్తున్నారు. ఈ విద్యార్థి కూడా కాలు కదిపాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తట్టి లేపి చూసేలోగా కన్నుమూశాడు. దీంతో పెళ్లి వేడుక వాతావరణం ఒక్కసారిగా విషాదం (Sadness) నింపింది. ఈ సంఘటన తమిళనాడు (Tamil Nadu)లో చోటుచేసుకుంది.
ఏపీలోని కర్నూలు (Kurnool)కు చెందిన శ్రీనివాస రెడ్డి కుమారుడు సత్యసాయి రెడ్డి (21) (Satya Sai Reddy). శ్రీపెరంబుదూరు (Sriperumbudur)లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల (Engineering College)లో బీటెక్ (B.Tech) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. తురైపాక్కంలో ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. కోయంబేడు (Koyambedu)లో ఓ ఫంక్షన్ హాల్ లో తన స్నేహితురాలి సోదరి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యాడు. ఈ సమయంలో అక్కడి పాటలకు డ్యాన్స్ చేస్తున్నాడు.
ఈ సమయంలో చెవిలో నుంచి రక్తం వచ్చింది. ఆ వెంటనే స్పృహ తప్పి కిందపడిపోయాడు. ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే అతడిని అన్నానగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యసాయి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అంతసేపు తమతో సరదాగా ఉన్న సత్యసాయి మృతితో స్నేహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా సత్యసాయికి ఫిట్స్ (Fits) ఉన్నట్లు తెలిసింది.