NZB: అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో యువకుడు మునిగి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీస్ అధికారులు విచారణ మమ్మరం చేశారు. నీటిలో పడగానే లోపలికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలు దొరికిన ప్రదేశం దాదాపు పది మీటర్ల లోతు ఉంటుందని అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుల్లో నీళ్లు మింగే చనిపోయారని వెల్లడయింది.