BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలను ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.