NZB: జైలు నుంచి వచ్చాక తొలిసారిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆమెకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.