PDPL: గోదావరిఖని పట్టణం రమేశ్ నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఆదివారం పొలం బాట పట్టారు. వరి పంట ఎలా వేస్తారు, పొలం, నారుమడి, నాట్లు తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు నేరుగా పంట పొలాలకు తీసుకువెళ్లారు. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి పంట పొలాలలో స్వయంగా విద్యార్థులు నాట్లు వేశారు.