HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే రైళ్లు ఏ ఫ్లాట్ ఫాం వైపు వస్తాయనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. అప్పటి దాకా ప్రయాణికులు ఆగాల్సిందే.. ఎటు వస్తుందో తెలియక ప్రయాణికులు ఎంట్రన్స్ బోర్డు వద్దకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కోసారి చివరి క్షణంలో ఫ్లాట్ ఫాం నంబర్ మారుతోంది.