ఖమ్మం: వృత్తి శిక్షణ కోసం జిల్లాలో అర్హులు జనవరి 6లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించే శిక్షణకు 18-35 ఏళ్ల వయసు కలిగి ఉండి, ఇంటర్ ఆపైన చదివినవారు అర్హులన్నారు. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జికూటివ్ రంగాల్లో 3 నెలల శిక్షణ ఉంటుందన్నారు.