CM JAGAN : విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన సీఎం జగన్
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ (CM JAGAN) కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లాలో(Prakasam District) పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సాయంత్రం విజయవాడ(Vijayawada) వచ్చారు. సీఎం జగన్ రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Governor Abdul Nazir) కలిశారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ (CM JAGAN) కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.ఈ ఉదయం ప్రకాశం జిల్లాలో(Prakasam District) పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సాయంత్రం విజయవాడ (Vijayawada) వచ్చారు. సీఎం జగన్ రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Governor Abdul Nazir) కలిశారు. వైజాగ్‌లో(Vizag) జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్‌కు తెలిపారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు. ఇప్పటికే చాలామంది విశాఖ (VISHAKHA) చేరుకున్నారు. ఈ సదస్సు కోసం సీఎం జగన్ రేపు విశాఖ వెళుతున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారు. విశాఖలో జీ-20 (G-20) సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు (AP Govt) అతిథుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేస్తోంది