ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపుర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను జిల్లా పాలనాధికారి రాజర్షి షా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్‌ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందజేయబడుతున్న మధ్యాహ్న భోజన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.