నల్గొండ: జిల్లాలో TSUTF ఆరవ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. క్లాక్ టవర్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో టీచర్లు బతుకమ్మలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పట్టుగొమ్మ అని వారు అన్నారు. రాష్ట్ర మహా సభల తరుణంలో నల్గొండ అరుణ వర్ణంతో మెరిసిపోతోంది.