ప్రకాశం: గిద్దలూరులో మాజీ మంత్రి భాస్కర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని మాట తప్పిన కూటమి ప్రభుత్వం అనే నినాదాలు చేశారు.