TG: ములుగు జిల్లాలోని మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య ఇళ్లకు ఎస్పీ శబరీష్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లిలో చొక్కారావు ఇంటికి వెళ్లి అతని తల్లి బతుకమ్మకు నిత్యావసరాలు అందించారు. అలాగే సాంబయ్య ఇంటికి వెళ్లి అతని భార్య సుజాతకు నిత్యావసర సరకులు అందించారు. చొక్కారావు, సాంబయ్య వనం వీడి జనంలోకి రావాలని సూచించారు.