ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ 2014లో చివరిసారిగా ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో బెస్ట్ మూమెంట్, బాధించే అంశాలు ఏంటని అడిగిన ప్రశ్నకు మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ అమెరికాతో పౌర అణుఒప్పందం తన జీవితంలో మరిచిపోలేని క్షణమని, అలాగే వైద్యరంగంలో పెద్దగా ఏమీ చేయలేకపోవడమే అతన్ని బాధపెట్టే అంశమని తెలిపారు.