AP: విజయవాడలో జరిగిన వాలీబాల్ జట్టు ఎంపిక ప్రక్రియలో శాప్ ఛైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. జనవరి 7 నుంచి 13 వరకు జైపూర్లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రోత్సాహానికి సీఎం సరికొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారని, క్రీడాకారుల భవిష్యత్తే ముఖ్యమని, రాజీపడే ప్రసక్తే లేదని రవినాయుడు పేర్కొన్నారు.