Puvvada ajay తనను ఓడించేందుకు ట్రై చేశారు..? ఈ సారి ఖమ్మంలో అలా ఉండదు: పువ్వాడ
Puvvada ajay kumar:రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది.ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు అంత పట్టు లేదు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada ajay kumar) ఒక్కరే గెలిచారు.ఈ సారి మాత్రం అలా ఉండదని ఆయన అంటున్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.
Puvvada ajay kumar:రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది. గెలుపు ఓటముల గురించి నేతలు మాట్లాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు అంత పట్టు లేదు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada ajay kumar) ఒక్కరే గెలిచారు.ఈ సారి మాత్రం అలా ఉండదని ఆయన అంటున్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కూడా చాలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
ఎన్నికలు వస్తున్నందున కొందరు పగటి వేసాలతో వస్తారని జాగ్రత్త అని సూచించారు. అలాంటి వారు ఎన్నికల తర్వాత కనబడరని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని (ponguleti srinivas reddy) ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. అన్నివేళలా తాను అందుబాటులో ఉంటానని పువ్వాడ అజయ్ (puvvada ajay) తెలిపారు. తాను.. పార్టీని కాదని ముందుకెళ్లలేనని అజయ్ (ajay) స్పష్టంచేశారు.
గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో (kammam) హేమ హేమీలు అంతా ఓడిపోయారు. తుమ్మల నాగేశ్వరరావును (tummala nageshwar rao).. పొంగులేటి శ్రీనివాస రెడ్డి (ponguleti srinivas reddy) ఓడించారని చర్చ జరుగుతుంది. ఆ సమయంలో పువ్వాడను (puvvada) ఓడించేందుకు కూడా పొంగులేటి ప్రయత్నించారట. కానీ పువ్వాడ (puvvada) మాత్రం తన తండ్రి చరిష్మాతో బయటపడగలిగారని విశ్లేషకులు అంటారు. ఇప్పుడు అదే విషయాన్ని పువ్వాడ అజయ్ (ajay) ప్రస్తావించారు.
ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy).. ఇప్పుడు సీఎం కేసీఆర్ (cm kcr) లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి పనులు చేయడం లేదని మండిపడుతున్నారు.