MBNR: హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన నాగలక్ష్మికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో భర్త శివ కుమార్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. 108 సిబ్బంది ఈఎంటీ మెహబూబ్ భాష పైలెట్ శివశంకర్ టంకర గ్రామానికి చేరుకొని నాగలక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో దారి మధ్యలోనే పండంటి మగ బిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.