నిజామాబాద్: భీంగల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణను పరిశీలించారు. ఈకార్యక్రమంలో భీంగల్ సీఐ నవీన్, ఎస్సై మహేశ్, ఏఎస్సై అబ్దుల్ సత్తార్, సిబ్బంది పాల్గొన్నారు.