TG: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కిలో MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.