విలన్ పాత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫతేహ్ జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూ అరుంధతి సినిమాలోని పశుపతి క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లోనే బాగా కష్టపడ్డ పాత్ర అని అన్నాడు. మేకప్‌కే ఆరేడు గంటలు పట్టేదన్నాడు. మేకప్ ద్వారా దద్దుర్లు వచ్చాయని వెల్లడించాడు.