»Amritpal Singh Sneaked Into Gurdwara Demanded Food Clothes At Gunpoint
Point blankలో గన్ పెట్టి.. బట్టలు, ఫుడ్ తీసుకున్న అమృత్ పాల్ సింగ్
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల (police) కళ్లు గప్పి పంజాబ్ (punjab) నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పారిపోయే ముందు సీసీటీవీ (cctv) ఫుటేజీ ఒకటి నిన్న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జలందర్ (jalander) వద్ద గల ఓ గురుద్వారాలో (gurdwara) చొరబడ్డారని తెలిసింది. అక్కడ ఉన్న వారిని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. ఆహారం, బట్టలు తీసుకున్నారట.
Amritpal Singh sneaked into gurdwara, demanded food, clothes at gunpoint
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల (police) కళ్లు గప్పి పంజాబ్ (punjab) నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పారిపోయే ముందు సీసీటీవీ (cctv) ఫుటేజీ ఒకటి నిన్న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జలందర్ (jalander) వద్ద గల ఓ గురుద్వారాలో (gurdwara) చొరబడ్డారని తెలిసింది. అక్కడ ఉన్న వారిని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. ఆహారం, బట్టలు తీసుకున్నారట.
అమృత్ పాల్ సింగ్‌ను (Amritpal Singh) పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు (punjab police) గత ఐదురోజుల నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఈ నెల 18వ తేదీన జలంధర్ వద్ద సినీ ఫక్కీలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. అతనిని అదుపులోకి తీసుకునేందుకు కార్లలో పోలీసులు వచ్చారు.
పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఇంతలో సీసీటీవీ ఫుటేజీని (cctv) ఓ వార్తా సంస్థ ప్లే చేసింది. సింగ్ కాన్వాయ్‌లో మూడు కార్లు ఉన్నాయి. అందులో సింగ్‌ది బెంజ్ కారు (benz car).. కాగా టోల్ గేట్ దాటే సమయంలో మాత్రం బ్రెజ్జా కారు కనిపించింది. అంటే బెంజ్ కారు కాకుండా.. బ్రెజ్జాలో సింగ్ పారిపోయాడు. దీంతో సిబ్బంది కూడా అతనిని గమనించే వీలు లేకుండా పోయింది.
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోగా.. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు నిన్న ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.