ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి కువైట్‌లో పర్యటించనున్నారు. రెండ్రోజుల పాటు కువైట్‌ను ప్రధాని సందర్శించనున్నారు. కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్-అహ్మద్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై కువైట్ రాజుతో చర్చించనున్నారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత తొలిసారి కువైట్‌లో భారత ప్రధాని పర్యటించటం విశేషం. పర్యటనలో భాగంగా కువైట్‌లోని భారతీయులతో ప్రధాని సమావేశంకానున్నారు.