TG: మక్తల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలకు రూ.47 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వినతి పత్రం అందజేశారు. ఏడు మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చేందుకు రహదారులు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.