ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టీజర్ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా విడుదల కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే తామే అధికారిక ప్రకటన చేస్తామన్నారు. మూవీ షూటింగ్ 80% పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.